మురసు తుఫాను ప్రభావం: ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

రిపోర్టర్: సునీల్ స్థలం: ఏలూరు

మురసు తుఫాను కారణంగా ఏలూరు జిల్లాలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ఈసీ వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు మరియు వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతో పాటు కొన్ని పోలింగ్ కేంద్రాల్ లో గురువారం జరగాల్సిన పోలింగ్ను శుక్రవారానికి మార్చారు. మిగిలిన ప్రాంతాల్ లో యథావిధిగా ఎన్నికలు జరుగుతాయని, ఏడో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.