జేఈఈ లేకుండానే ఐఐటీ మద్రాస్‌లో బీఎస్ కోర్సులకు ప్రవేశాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: తమిళనాడు

జేఈఈ స్కోరు లేకుండానే ఐఐటీ మద్రాస్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ కోర్సులు చదివేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. క్యాంపస్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్ ద్వారా ఈ కోర్సులు అభ్యసించవచ్చు. అర్హత లేని విద్యార్థులు నాలుగు వారాల క్వాలిఫైయర్ ప్రక్రియ ద్వారా ప్రవేశం పొందవచ్చు. సెప్టెంబర్ 2026 సెషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 27 ఆఖరు తేదీగా నిర్ణయించారు.