నేపాల్ లో భారీ వరద బాధితులకు 11 టన్నుల సహాయక సామగ్రిని పంపిన భారత్
రిపోర్టర్: వెంకట్
స్థలం: నేపాల్
భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో విపత్తును ఎదుర్కొంటున్న పొరుగు దేశం నేపాల్‌కు భారత్ శనివారం మరోసారి మానవతా సాయం అందించింది. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మందులు, ఫోరెన్సిక్ సామాగ్రి, టెంట్లు, పరిశుభ్రత కిట్లు మరియు స్లీపింగ్ బ్యాగులతో కూడిన 11 టన్నుల సహాయక సామగ్రిని నేపాల్‌కు పంపినట్లు తెలిపారు. నేపాల్ కోలుకునే ప్రక్రియకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.