నెల్లూరుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక.. ఘనస్వాగతం

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నెల్లూరు రైల్వే స్టేషన్కు విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు, సింహపురి వైద్య సేవా సమితి ట్రస్ట్ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆహ్వానం మేరకు స్వర్ణ భారత్ ట్రస్ట్ కార్యక్రమాల పర్యవేక్షణ నిమిత్తం ఆయన నెల్లూరుకి చేరుకున్నట్లు బీజేపీ ఉమ్మడి రాష్ట్ర పూర్వ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఆరుముళ్ల మురళి తెలిపారు.