నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఐఓసీఎల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పశ్చిమ ప్రాంతంలో వివిధ విభాగాలలో మొత్తం మూడు వందల ముప్పై ఐదు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు నేటి నుంచి వచ్చే నెల నవంబర్ నాల్గవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదని స్పష్టం చేశారు.