ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయమన్న ఎమ్మెల్యే మురళీమోహన్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: చిత్తూరు
పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో చిత్తూరు క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ వినతులను నేరుగా అందజేశారు. అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.