తిరుమల డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటా విడుదల షెడ్యూల్.
రిపోర్టర్: సురేష్
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి డిసెంబర్ నెల ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి గదుల కోటా విడుదలకు టీటీడీ షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 19న ఎలక్ట్రానిక్ డిప్ సేవల నమోదు ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మరియు గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.