ప్రాజెక్ట్ అన్నపూర్ణతో దాతృత్వం: నాలుగు వందల కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ నటి రష్మిక ప్రాజెక్ట్ అన్నపూర్ణ ద్వారా నాలుగు వందల పేద కుటుంబాలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్తో పాటు పలు ప్రధాన నగరాల్లోని నిరుపేద కుటుంబాలకు సహాయం అందించనున్నట్లు ఆమె తెలిపారు. తొలిదశలో ఎనిమిది నగరాల్లో మూడు నెలలకు సరిపడా బియ్యం, గోధుమపిండి, వంటనూనె తదితర నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పేద కుటుంబాల ఖర్చుకు భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు స్పష్టం చేశారు.