పులివెందుల సంచలనం: అంకె రాజు హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Kadapa

కుటుంబ కలహాల నేపథ్యంలో మామను కత్తితో పొడిచి హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ వెల్లడించారు. కడప జిల్లా లింగాల మండలం మురారిచింతల గ్రామానికి చెందిన అంకె రాజు హత్య ఘటనలో అల్లుడు సుధీర్, అతని స్నేహితుడు మందుగుండు దిలీప్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధంతో పాటు రక్తపు మరకల దుస్తులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.