వర్ధన్నపేటలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దహనం

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించడం ప్రజాస్వామ్యాన్నే అవమానించడమేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.