రామచందర్ రావు అరెస్టును తీవ్రంగా ఖండించిన బీజేపీ నేతలు
రిపోర్టర్: విజయ్
స్థలం: Jadcherla, Telangana
జూరాల ప్రాజెక్టు వద్ద నీళ్లు లేక ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావును జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికమని బీజేపీ నేతలు మండిపడ్డారు. రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తున్న నాయకులను అణచివేయాలని చూస్తే ప్రభుత్వానికి తగిన మూల్యం తప్పదని వారు హెచ్చరించారు.