గాజువాకలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. పాల్గొన్న వంశీరెడ్డి

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని 74వ వార్డు కోనవానిపాలెం గ్రామంలో శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకలు అత్యంత ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా స్థానికులు భక్తిభావితో పూజా కార్యక్రమాలు జరిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి ప్రత్యేకంగా పాల్గొని శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు.