పొగాకు ఉత్పత్తుల ప్రకటనలపై సినీ నటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెచ్చరిక

రిపోర్టర్: మహేష్ స్థలం: మహారాష్ట్ర

పొగాకు ఉత్పత్తుల పరోక్ష ప్రకటనలపై సినీ నటులను హెచ్చరిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మహారాష్ట్ర ఎఫ్డీఏ చర్యల నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలను ఎఫ్డీఏ చీఫ్ తుకారామ్ ముండే సోషల్ మీడియాలో షేర్ చేశారు. సెలబ్రిటీల ప్రభావం చట్టానికి అతీతం కాదని, ప్రజా ఆరోగ్యమే అత్యున్నతమని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామం ప్రముఖుల వాణిజ్య ప్రకటనలపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది.