హారర్ జోనర్లోకి ఇమ్రాన్ హష్మీ రీఎంట్రీ: రూహ్ ఫస్ట్ లుక్ విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: ముంబై

బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ తాజాగా రూహ్ చిత్రంతో హారర్ జోనర్లోకి అడుగుపెడుతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్ లో 2027లో భారీగా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. చెట్టు ఊడల మధ్యలో నుంచి భయంకరమైన లుక్ లో ఉన్న ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మయాంక్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కుమార్ తౌరానీతో కలిసి ఇమ్రాన్ హష్మీ స్వయంగా నిర్మాణం వహిస్తున్నారు.