వాయుగుండం ప్రభావంతో కుండపోత వర్షాలు ఆరుగురు దుర్మరణం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విశాఖపట్నం

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. విశాఖపట్నంలో అత్యధికంగా 277.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు, గోడ కూలి ఒక బాలుడు మృతి చెందారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగాయని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.