పోలేరమ్మ జాతర ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందజేసిన అధికారులు

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

పొదలకూరులో గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు అక్టోబర్ ఆరు నుంచి ఎనిమిది వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పావన వేడుకలకు రావాల్సిందిగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆలయ ఈవో ప్రసాద్ రెడ్డితో పాటు గ్రామ ప్రముఖులు అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.