'రూ. 2.5 కోట్ల వేతనంతో సీఐఎస్‌ఓ పోస్టుల భర్తీ': ఎస్‌బీఐ ప్రకటన

రిపోర్టర్: నరేష్ స్థలం: ముంబై

దేశీయ దిగ్గజ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. రూ. 2.5 కోట్ల వరకు వార్షిక వేతనం ఉండే ఈ సీఐఎస్‌ఓ ఉద్యోగానికి ఐటీ నిపుణులు సెప్టెంబర్ 24, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ అధికారులు తెలిపారు.