నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, మహిళ మృతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాయుడుపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. వసతి గృహంలో ఉన్న కుమార్తెను తీసుకువచ్చేందుకు కుటుంబంతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్తకు తీవ్రగాయాలు కాగా, మరో కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.