నీటిపై బైక్ ప్రయాణం: సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన చైనా సాహసికుడు
రిపోర్టర్: నరేష్
స్థలం: Hunan
చైనాకు చెందిన జాంగ్ జూ అనే సాహసికుడు నీటిపై బైకుతో నూతన ప్రపంచ రికార్డు సృష్టించినట్లు గిన్నిస్ సంస్థ అధికారులు తెలిపారు. హునాన్ ప్రావిన్స్‌లో ప్రత్యేకంగా మార్పులు చేసిన మోటార్‌సైకిల్‌పై ఆయన సుమారు నలభై కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి ఈ ఘనత సాధించారు. గతంలో ఉన్న రికార్డును అధిగమించేందుకు ఆయన సుదీర్ఘకాలంగా అనేక ప్రయత్నాలు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ అసాధారణ సాహస ప్రదర్శనతో ఆయన అంతర్జాతీయంగా అందరి ప్రశంసలు అందుకున్నారు.