తిరుపతిలో భక్తిశ్రద్ధలతో ఘనంగా ఏడో రోజు వినాయక నిమజ్జనం
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
తిరుపతి నగరంలో ఏడో రోజు వినాయక నిమజ్జన కార్యక్రమం అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విగ్రహాలను ప్రత్యేక వాహనాలపై ఊరేగింపుగా తీసుకువచ్చి నిమజ్జనం చేశారు. అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.