విశాఖలో ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విశాఖపట్నం అర్బన్

విశాఖపట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ప్రముఖ రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. బీచ్ రోడ్డులోని కామత్ హోటల్లో నిల్వ ఉంచిన అరవై కేజీల పాడైన చికెన్, పిస్తా హౌస్లో ముప్పై కేజీల మాంసాన్ని అధికారులు ధ్వంసం చేశారు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా జగదాంబలోని ఆల్ఫా హోటల్, సిరిపురంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లలో గంట గదులను సీజ్ చేశారు.