కోదాడలో భారీ గంజాయి పట్టివేత: రూ. 75 లక్షల విలువైన సరుకు స్వాధీనం
రిపోర్టర్: రాము
స్థలం: సూర్యాపేట
రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరోధానికి కఠిన చర్యలు చేపడుతున్న తెలంగాణ ఈగిల్ ఫోర్స్ కోదాడ టౌన్ పోలీసులతో కలిసి నిర్వహించిన ఉమ్మడి ఆపరేషన్ లో రూ. 75 లక్షల విలువైన 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి కర్ణాటకకు కారులో తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.