చెన్నై సూపర్ కింగ్స్ కోచింగ్ బాధ్యతలపై సురేశ్ రైనా కీలక ప్రకటన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: చెన్నై
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో కోచింగ్ సిబ్బందిగా చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తెలిపారు. రవిచంద్రన్ అశ్విన్ తో జరిగిన సంభాషణలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయమై తాను ఇప్పటికే యాజమాన్యాన్ని సంప్రదించానని, వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. జట్టు విజేతగా నిలవడంలో తన అనుభవం ఉపయోగపడుతుందని, ఎలాంటి బాధ్యతనైనా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.