'ఆరోగ్యశ్రీ నిధుల్లో రూ.32.75 లక్షల గోల్‌మాల్': ఇద్దరు ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు
రిపోర్టర్: విజయ్
స్థలం: శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిధులకు సంబంధించి భారీ గోల్‌మాల్ వెలుగుచూసింది. ఏకంగా రూ.32.75 లక్షలు పక్కదారి పట్టించినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఇద్దరు ఉద్యోగులపై ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ నేరుగా శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వైద్య రంగంలో ఈ తరహా నిధుల దుర్వినియోగం కలకలం రేపుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.