ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నల్గొండ
ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన అమరవీరుడు కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించినట్లు మంత్రి Komatireddy Venkat Reddy వెల్లడించారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో గిరిజనుల హక్కుల కోసం భీమ్ చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి కర్తవ్యమని పేర్కొంటూ ఈ మేరకు ప్రత్యేకంగా నివాళులు అర్పించారు.