విజయవాడలో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయవాడ

విజయవాడ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో ఆయుష్మాన్ భారత్ నిధులతో రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జె.పి.నడ్డా శనివారం ప్రారంభించనున్నారు. గత వైకాపా పాలనలో పునాదుల దశలోనే నిలిచిపోయిన ఈ పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేగంగా పూర్తి చేసింది.