ప్రధాని మోడీని కలిసిన బాల్యస్నేహితుడు, భూ వివాదంపై సీబీఐ విచారణకు విజ్ఞప్తి

రిపోర్టర్: సురేష్ స్థలం: మహారాష్ట్ర

గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గరాలీ వోహ్రా తన దశాబ్దాల నాటి భూ వివాదంపై ప్రధానిని ఆశ్రయించారు. భయందర్‌లో తాను కొనుగోలు చేసిన భూమిని కొందరు కబ్జా చేశారని, నకిలీ పత్రాలు సృష్టించారని ఆయన ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రధానిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు వోహ్రా తెలిపారు.