ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ద్వారకా తిరుమల దేవస్థానం నుంచి వచ్చిన అధికారులు అమ్మవారికి సారె సమర్పించగా, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.