వైఎస్సార్సీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు చిన్న శ్రీను

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయనగరం

స్థానిక ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో అనుచరులతో కలిసి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. కుటుంబ విభేదాలు, ప్రాధాన్యం తగ్గించడమే ఈ రాజీనామాకు కారణమని తెలుస్తోంది.