అంగన్వాడీలకు కనీసం వేతనం పెంచాలంటూ ఏఐటీయూసీ నేతల డిమాండ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రైల్వే కోడూరు
రైల్వేకోడూరులో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీ వర్కర్లకు రూ.36 వేల వేతనం ఇవ్వాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నంద్యాల సరోజనమ్మ డిమాండ్ చేశారు. హెల్పర్లకు పింఛన్ సౌకర్యం కల్పించడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా పింఛన్లు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షురాలు కే. నిర్మల, కార్యదర్శి వై. విజయలక్ష్మి పాల్గొన్నారు.