ఢిల్లీలో ఉద్రిక్తత: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సహా పలువురు అరెస్ట్

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాక ప్రదర్శనకు పిలుపునిచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేను, ఏఐఎస్ఏ కార్యకర్త నేహా బోరాను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనుమతి లేదన్న కారణంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. జాతీయ జెండా ఎగురవేయడం నేరం కాదంటూ సీజేపీ నేతల అరెస్ట్ను నిరసిస్తూ నిర్వహించ తలపెట్టిన ఈ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.