'సహజ జల వనరుల్లో విగ్రహాల నిమజ్జనం ఆపేస్తాం': తమిళనాడు ప్రభుత్వం స్పష్టీకరణ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తమిళనాడు
తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని ఫోర్‌షోర్ ఎస్టేట్ మరియు నీలంకరై బీచ్‌లలో వచ్చే ఏడాది నుంచి విగ్రహాల నిమజ్జనాన్ని అనుమతించబోమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు ఆదేశాలకనుగుణంగా 2027 నాటికి సహజ జల వనరులలో విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిగా నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రిబ్యునల్‌కు తెలిపింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేయనున్న అఫిడవిట్లో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.