విజయవాడలో మహిళను కిరాతకంగా హత్య చేసి పది ముక్కలుగా నరికిన వైనం
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయవాడ
విజయవాడ ఎన్టీటీపీఎస్ కూలింగ్ కాలువలో లభ్యమైన మహిళ శరీర భాగాల కేసులో మిస్టరీ వీడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలను మంగళగిరికి చెందిన కల్యాణి అలియాస్ దుర్గగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. భవానీపురానికి చెందిన షఫి అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. కుమారుడిని అప్పగించాలని కోరడంతోనే కల్యాణిని అతి కిరాతకంగా హత్య చేసి కాలువలో పడవేసినట్లు విచారణలో వెల్లడైంది.