నార్సింగిలో భారీ డ్రగ్స్ గుట్టురట్టు: వంద గ్రాముల కొకైన్ స్వాధీనం

రిపోర్టర్: అశోక్ స్థలం: నార్సింగి

నార్సింగి పరిధిలో భారీగా సాగుతున్న కొకైన్ అక్రమ రవాణా నెట్వర్క్ను పోలీసులు చేధించినట్లు అధికారులు తెలిపారు. సైబరాబాద్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్, ఈగల్ వింగ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో నిందితుల నుంచి 107.4 గ్రాముల కొకైన్ తో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ కారిడార్ పరిధిలోని ప్రముఖులు, యువతే టార్గెట్గా ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు తేలిందని, అక్రమ ఆదాయంతో కూడబెట్టిన రూ. రెండు కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.