కోరుట్ల సాయిరామ దేవాలయ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనుష

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కోరుట్ల

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ సాయిరామ దేవాలయ కార్యనిర్వహణ అధికారిగా వి. అనుష శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆమె ఈ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని నూతన ఈవో అనుష స్పష్టం చేయడం విశేషం.