పోషణ మాసంతోనే మహిళల్లో సంపూర్ణ ఆరోగ్య భద్రత
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని లంకెలపాలెం అంగన్వాడీ పాఠశాలలో పోషణ మాసం వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎక్స్ కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్, ఎంఈఓ జగన్నాథం, ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి గర్భిణులు, బాలింతలకు పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రోజువారీ భోజనంలో ఆకుకూరలు, పండ్లు, ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.