మనుబోలులో ముమ్మరంగా కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వే: ఏఎన్ఎంల పర్యవేక్షణ
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విస్తృతంగా కుష్టు వ్యాధి సర్వే చేపట్టారు. వైద్య సిబ్బంది నేరుగా ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. స్థానిక ప్రజలు సైతం సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం మాధవి, ఆశా కార్యకర్తలు కామేశ్వరి, సునీత తదితరులు పాల్గొని వ్యాధి ప్రాథమిక లక్షణాలను గుర్తించేందుకు ప్రజలను సమగ్రంగా పరిశీలించి అవగాహన కల్పించారని సిబ్బంది పేర్కొన్నారు.