టెక్సాస్ సెనెట్ పోరులో మస్క్ ధనంపై డెమోక్రటిక్ నేత జేమ్స్ తలారికో మండిపాటు
రిపోర్టర్: సునీల్
స్థలం: హూస్టన్
టెక్సాస్ సెనెట్ ఎన్నికల పోరులో భాగంగా హూస్టన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జేమ్స్ తలారికో ఎలన్ మస్క్ ధనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లికన్ అభ్యర్థి కెన్ పాక్సన్ కోసం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మస్క్ సెనెట్ స్థానాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనకు శాసనసభ రికార్డు ఉంటే, పాక్సన్ కు నేర చరిత్ర ఉందని జేమ్స్ తలారికో ఘాటుగా విమర్శించారు.