2029 నాటికి మరో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లు: నారా లోకేష్
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
విజయవాడలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. 2029 నాటికి క్రమం తప్పకుండా మూడు డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117ను సవరిస్తూ, పాఠశాల సిలబస్లో సమగ్ర మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. విమర్శలకు భయపడకుండా ఏపీ విద్యా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని, ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.