ఇండియా కూటమి నేతల అరెస్టులు అన్యాయం: మల్లు భట్టి విక్రమార్క ధ్వజం
రిపోర్టర్: శివ
స్థలం: ఖమ్మం
ఢిల్లీలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి అగ్రనేతల అక్రమ అరెస్టులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఎన్నికల పారదర్శకత మరియు రాజ్యాంగబద్ధ సంస్థల జవాబుదారీతనం కోసం శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్యం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.