ఆజాద్ మైదాన్ లో సినిమా షూటింగ్: ముంబై క్రికెట్ సంఘం తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: Mumbai
ముంబైలోని చారిత్రాత్మక ఆజాద్ మైదాన్ లో రణ్వీర్ సింగ్ సినిమా షూటింగ్ కు అనుమతి ఇవ్వడంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన అండర్-14, అండర్-16 ఇంటర్స్కూల్ క్రికెట్ మ్యాచ్లను వాయిదా వేయాల్సి వచ్చిందని ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు నదీమ్ మేమన్ తెలిపారు. క్రీడా మైదానాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతూ యువ ఆటగాళ్ల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.