మృతుల కుటుంబాల పరామర్శ: మల్యాలలో నేతల సానుభూతి ప్రకటన

రిపోర్టర్: Ajay (దిశ) స్థలం: మల్యాల

మల్యాల మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జవ్వాజి లచ్చిరెడ్డి మరియు ముకుందు లక్ష్మి కుటుంబాలను మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదివారం పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, వారిని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగం శ్రీనివాస్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ సాగర్ రావుతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.