తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో స్తంభించిన జనజీవనం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: విజయనగరం
తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు, ఈదురుగాలులకు జనజీవనం స్తంభించిందని అధికారులు తెలిపారు. నదులు, వాగులు పొంగిపొర్లుతుండగా, పలుచోట్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయని వెల్లడించారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని చెప్పారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ దామోదర్ కోరారు.