ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు మద్దతు: రేవంత్ సర్కార్ తీరుపై ఈటల రాజేందర్ ఫైర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: నిర్మల్
జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె సమంజసమని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నిర్మల్ లో దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఈ ఆందోళనకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన వెల్లడించారు.