నెల్లూరు జిల్లాలో రౌడీషీటర్లకు పోలీసుల సత్‌ప్రవర్తనా కౌన్సిలింగ్
రిపోర్టర్: సురేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు పోలీసులు సత్‌ప్రవర్తనా కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో జీవించాలని స్పష్టం చేశారు. ప్రజా శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే పీడీ చట్టం ప్రయోగిస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు.