ఈ నెల 15న ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 15న ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి ప్రకటన వెలువడనుంది. జులై 1 నాటికి వయసు పరిమితిని పరిగణలోకి తీసుకుంటారు. గ్రూప్-1 పోస్టుల జాబితాను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టులను మల్టీజోన్‌లుగా మార్చారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను మాన్యువల్‌గా నిర్వహించనున్నారు.