మురసు తుఫాను ముప్పు: అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసుల హెచ్చరిక
రిపోర్టర్: సునీల్
స్థలం: NTR
మురసు తుఫాను తీవ్రత నేపథ్యంలో ప్రజలు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని Vijayawada City Police స్పష్టం చేశారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులకు దూరంగా ఉండాలని సూచించారు. నీరు నిలిచిన రోడ్లపై ప్రయాణించేటప్పుడు తీవ్రంగా అప్రమత్తంగా ఉండాలని, ప్రజల భద్రత తమ ప్రథమ ప్రాధాన్యతని పేర్కొంటూ పోలీసు అధికారులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.