విశాఖలో కలకలం: హెచ్పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చెలరేగిన మంటలు
రిపోర్టర్: సునీల్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. రిఫైనరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సేఫ్టీ వింగ్ సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు. ప్రచారంలో ఉన్న పేలుడు కోణంపై అధికారులు తీవ్రంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం.