సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తమపై చేస్తున్న భూ ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు కుటుంబ సభ్యులపై వస్తున్న నిరాధార ఆరోపణలపై సిట్టింగ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల అమలును ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు.