ఇరాన్ అణు కేంద్రంపై దాడులకు ట్రంప్ సంచలన హెచ్చరిక

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌లోని రహస్య భూగర్భ అణుకేంద్రం 'పికాక్స్ మౌంటెన్'పై దాడులు చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అణు కేంద్రంలోని ప్రతి కదలికపై అమెరికా నిఘా ఉందని, ఇరాన్ పొరపాటు చేస్తే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇది పూర్తి స్థాయి యుద్ధం కాదని, కేవలం సైనిక ఘర్షణ మాత్రమేనని ఆయన పేర్కొనడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.